News April 3, 2024
సీఎం కేజ్రీవాల్‌కు అనారోగ్యం!
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన దాదాపు 4.5 కేజీల బరువు తగ్గినట్లు సమాచారం. కాగా నిన్న ఆయన షుగర్ లెవల్స్ పడిపోవడంతో మెడిసిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలతో ఆయనకు కోర్టు 15 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది.
Similar News
News November 8, 2024
పోలీసులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
AP: సోషల్ మీడియాలో పోస్టులు, అరెస్టులపై చర్చించేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.
News November 8, 2024
భారీ జీతంతో SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. ఎస్సైల పే స్కేల్ రూ.35,400-1,12,400, హెడ్ కానిస్టేబుల్ పే స్కేల్ రూ.25,500-81,100గా ఉంది. <
News November 8, 2024
తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా?: హరీశ్
TG: కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదా? రేవంత్ సీఎం అయ్యేవాడా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. KCR ఆనవాళ్లు లేకుండా మూసీ శుద్ధి చేయడం సాధ్యం కాదని అన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఒక్క ఇళ్లు కట్టలేదని దుయ్యబట్టారు. కూలగొట్టడం తప్ప నిర్మించడం రేవంత్‌కు తెలియదని మండిపడ్డారు. సీఎం బెదిరింపులకు భయపడమని, ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.