News September 3, 2025

HYD: మంచి నీళ్ల కోసం మహిళల నిరసన

image

మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని 16, 17వ వార్డుల్లో తాగునీరు సరఫరా కావడం లేదని ఆ బస్తీ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల తమ పంచాయతీ మున్సిపాలిటీలో విలీనమైందని, అయితే గ్రామ పంచాయతీ హయాంలో వేసిన పైప్‌లైన్‌ కావడంతో వారానికి ఒకసారి చాలీచాలని బోరు నీటిని వదలడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 5, 2025

HYD: ఆదివారం ఆలయాలు బంద్

image

ఈ నెల 7వ తేదీన(ఆదివారం) చంద్ర గ్రహణం ఉంది. ఆ రోజు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మధ్యాహ్నం 12 గంటలకు మూసి వేస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 8:30 గంటలకు తెరుస్తామని చెప్పారు. ఇక చిల్కూరు బాలాజీ ఆలయం ఆదివారం సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు తెరుస్తారు. భక్తులు గమనించాలని ఆలయ సిబ్బంది సూచించారు.
SHARE IT

News September 5, 2025

రేపు నగరం కిటకిట

image

గణపతి నిమజ్జన ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. వేలాది వినాయక విగ్రహాలు వివిధ రూపాల్లో నగర ప్రజలను కనువిందు చేయనున్నాయి. ఈ వేడుకను చూసేందుకు చిన్నా..పెద్దా అందరూ ఎదురుచూస్తున్నారు. నగరవాసులే కాక తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. దాదాపు 40 లక్షల మంది నిమజ్జన ఘట్టాన్ని తిలకించనున్నారని గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు.

News September 5, 2025

HYD పరువు తీస్తున్నారు.. మీరు మారరా?

image

వినాయకచవితి పండుగ నగర యువతకు ఒక ఎమోషన్. ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే వేడుక ఇది. కానీ, కొందరు పరువు తీస్తున్నారు. ఖైరతాబాద్‌‌కు దర్శనానికి వచ్చిన అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి 930 మంది పట్టుబడ్డారు. మరికొందరు మద్యం తాగి జులూస్‌లకు వస్తున్నారు. భక్తిపాటలకు బదులు తమకు నచ్చిన పాటలతో చిందులేసిన వీడియోలు SMలో వైరల్ అయ్యాయి. ఇకనైనా వీటికి స్వస్థి పలికి భక్తితో నిమజ్జనం చేద్దాం. దీనిపై మీ కామెంట్?