News April 3, 2024

ప.గో.: టీడీపీ- బీజేపీ- JSP కూటమి అధినాయకులకు విజ్ఞప్తి

image

టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అధినాయకులకు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బుధవారం ఒక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 25% జనాభా ఉన్న కాపు కులస్థులకు కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వారి సంతృప్తి మేరకు హామీలను ప్రకటించాలన్నారు. బీసీలతో సమానంగా సంక్షేమ సౌకర్యాలు, పెళ్లి ఖర్చుల నిమిత్తం కానుకగా రూ.లక్ష ఇవ్వాలన్నారు. జనాభా ప్రాతిపదికన కాపు కార్పొరేషన్ సంక్షేమ బడ్జెట్, అలాగే రిజర్వేషన్లు కేటాయించాలన్నారు.

Similar News

News April 18, 2026

మొగల్తూరు: వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం

image

మొగల్తూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని గుబ్బల మావుళ్లు గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను నిత్యం వెంబడిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి, ఈనెల 14న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీనిపై మొగల్తూరు ఎస్సై జి.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

News April 18, 2026

బార్ హెల్పర్‌పై దాడి ఘటనలో ముగ్గురిపై కేసు: SI జయలక్ష్మి

image

నరసాపురంలోని ఒక రెస్టారెంట్ అండ్ బార్‌లో గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుందని SI జయలక్ష్మి తెలిపారు. బార్ ముగిసే సమయం కావడంతో వెళ్లిపోవాలని కోరిన హెల్పర్ పులపర్తి వెంకట బాలాజీపై వర్ధినీది సాయి, పాలూరి బోల, పాలూరి నరసింహ మద్యం బాటిల్‌తో దాడి చేశారని వెల్లడించారు. ఈ దాడిలో బాలాజీ నుదుటిపై తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 17, 2026

భీమవరం: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

image

భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. మొత్తం 15 అర్జీలు అందాయని, అందులో ప్రధానంగా వైద్య సహాయం, ఉపాధి, రూ.15 వేల పెన్షన్ మంజూరు వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.