News September 3, 2025
2 వారాల్లో రూ.18కోట్లు చెల్లించండి: సుప్రీం కోర్టు

AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేశారంటూ గతంలో జేపీ వెంచర్స్‌కు NGT రూ.18 కోట్లు జరిమానా విధించింది. ఆ ఫైన్‌ను 2 వారాల్లో చెల్లించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో NGT జరిమానాపై గతంలో విధించిన స్టేను ఎత్తేసింది. ఇసుక తవ్వకాలపై నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్‌ను SC స్వీకరించి విచారణ జరిపింది.
Similar News
News September 5, 2025
థాయ్‌లాండ్ కొత్త ప్రధానిగా అనుతిన్ చర్న్‌విరకుల్

థాయ్ కొత్త ప్రధానిగా Bhumjaithai party నేత అనుతిన్ చర్న్‌విరుకుల్ ఎన్నికయ్యారు. తాజాగా పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. గతనెల షినవత్రాను ప్రధాని పదవి నుంచి రాజ్యాంగ న్యాయస్థానం <<17554052>>తొలగించింది<<>>. దీంతో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అపోజిషన్ పార్టీకి అధికారం దక్కింది.
News September 5, 2025
పాండ్య బ్రదర్స్ మంచి మనసు

టీమ్ ఇండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య మంచి మనసు చాటుకున్నారు. తమ చిన్ననాటి కోచ్ జితేంద్ర సింగ్‌కు రూ.80 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా జితేంద్రనే ఓ మీడియాకు తెలిపారు. తన చిన్న చెల్లెలు పెళ్లి కోసం రూ.20 లక్షలు, కారు కోసం రూ.20 లక్షలు, తల్లి చికిత్స కోసం కొంత నగదు, ఇతర అవసరాల కోసం రూ.18 లక్షలు ఇలా ఇప్పటివరకు రూ.70-రూ.80 లక్షల వరకు ఇచ్చారని వెల్లడించారు.
News September 5, 2025
డేంజర్.. మీ పిల్లలు ఇలా నడుస్తున్నారా?

ఏడాది దాటాక పిల్లలు బుడిబుడి అడుగులు వేయడం మొదలు పెడతారు. ఈ క్రమంలో కాలివేళ్లపై నడుస్తారు. కానీ మూడేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లలు అలాగే నడుస్తుంటే అది ఆటిజం వ్యాధికి సంకేతం కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆటిజం ఒక న్యూరో డెవలప్‌మెంటల్ కండిషన్. దీనివల్ల ఇంద్రియాల మధ్య సమన్వయం ఉండదు, భావ వ్యక్తీకరణలోపం ఉంటుంది. కాబట్టి చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.