News September 3, 2025
రాజమండ్రి టీచర్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు

రాజమండ్రి లాలాచెరువు హైస్కూల్ ఉపాధ్యాయురాలు మోటూరి మంగారాణి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు. వృత్తిపట్ల అంకితభావం, నూతన టెక్నాలజీతో బోధన చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. టీచర్లకు అవసరమైన ఎన్నో చక్కటి వీడియోలు రూపొందిస్తారు. నిత్య విద్యార్థిగా ఉంటూ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్‌గా రాణిస్తున్నారు. సెప్టెంబర్ 5న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
Similar News
News September 7, 2025
వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి: ఎస్పీ

వినాయక చవితి వేడుకలు, మిలాద్ – ఉన్ – నబీ వేడుకలు జిల్లాలో శాంతియుతంగా జరిగాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ఈ పండుగలు మత సామరస్యాన్ని చాటి చెప్పాయన్నారు. విజయవంతంగా వేడుకలు నిర్వహించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. సహకరించిన కమిటీలు, రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.
News September 7, 2025
ధవలేశ్వరం: తగ్గుముఖం పట్టిన వరద

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శనివారం రాత్రి 9 గంటలకు 7,38,035 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 14,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News September 7, 2025
రాజమండ్రి: కేసుల దర్యాప్తుకు కొత్త జాగిలాలు

కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపులో పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త జాగిలాలు వచ్చినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ తెలిపారు. ఈ నూతన జాగిలాల చేరికతో దర్యాప్తు మరింత శక్తివంతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ‘రాడో’ అనే జాగిలం శిక్షణ కాలంలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానం సాధించిందని ప్రశంసించారు. డాగ్ హ్యాండ్లర్ల కృషిని ఆయన అభినందించారు.