News September 3, 2025
చేగుంటలో క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు పరీక్షలు

చేగుంట గురుకుల పాఠశాలలో ఈనెల 8, 9న గిరిజన గురుకుల క్రీడా పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని ఉదయం 10:30 గంటల లోగా చేగుంట గురుకుల పాఠశాలలో జరిగే పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
Similar News
News September 5, 2025
MDK: కార్మిక నేత ఎల్లయ్య.. మొదటి ప్రభుత్వ టీచర్

అకాల మరణం పొందిన బీహెచ్ఈఎల్ పరిశ్రమ కార్మిక సంఘం సీనియర్ నాయకులు ఎల్లయ్య ఒకప్పుడు హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేటలో మొదటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఏడాదిన్నర తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ పరిశ్రమలో ఉద్యోగంలో చేరారు. ఆయన స్వగ్రామం రామయంపేట మండలం అక్కన్నపేట. కార్మిక నాయకుడిగా ఎదిగి తెలంగాణ వాదం వినిపించారు. వివిధ పరిశ్రమల కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎల్లయ్య పాత్ర మరువలేనిది.
News September 4, 2025
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

నర్సాపూర్లోని రాయరావుచెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. గణనాథుల నిమజ్జనానికి తరలివచ్చే సమయంలో భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై తెలియజేయాలని పుర కమిషనర్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మైపాల్, తహశీల్దార్ శ్రీనివాస్, నీటిపారుదలశాఖ మండల అధికారి మణిభూషణ్, మునిసిపల్ సిబ్బంది, తదితరులున్నారు.
News September 4, 2025
మెదక్ జిల్లాలో 58 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక: డీఈవో

మెదక్ జిల్లాలో 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు డీఈవో ప్రొ. రాధాకిషన్ తెలిపారు. ఈనెల 6న కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో జీహెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీజీటీ, టీజీటీ, ఎస్జీటీ ఉపాధ్యాయులున్నారని డీఈవో వివరించారు.