News September 3, 2025
నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించండి: ఆదిలాబాద్ SP

గణేష్ నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం సాయంత్రం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News September 5, 2025
రేపు ఆదిలాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు :ఎస్పీ

గణపతి నిమజ్జనం సందర్భంగా ఆదిలాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది, ప్రత్యేకంగా 50 మంది సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 24 గంటలు విధులు నిర్వహిస్తుంటారని తెలిపారు. ప్రజలు వారికి సహకరించాలని కోరారు.
News September 5, 2025
గణేశ్ నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు: ADB SP

గణపతి నిమజ్జనోత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 600 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారన్నారు. నిఘా కోసం 350 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. 8 సెక్టార్లు, 8 క్లస్టర్లు, 23 పికెట్లు, రూఫ్‌టాప్ బందోబస్తు, హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.
News September 5, 2025
ADB: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా శశికళ

ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పిప్పర్ వాడ జడ్పీహెచ్ఎస్ హెడ్‌మాస్టర్ జి.శశికళ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికయ్యారు. ఈనెల 5న హైదరాబాద్‌లో ఆమె అవార్డు అందుకొనున్నారు. విద్యార్థులలో అభ్యాస సామర్థ్యాలను పెంచడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులుగా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఎంపికైన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.