News September 3, 2025

రవాణా శాఖ అధికారిగా కృష్ణారావు బాధ్యతలు

image

పశ్చిమగోదావరి జిల్లా రవాణా అధికారిగా కృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్ తనిఖీలు, రహదారి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News September 9, 2025

పదవి వద్దంటూ చంద్రబాబుకి అంగర లేఖ

image

రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మెహనరావును నియమిస్తూ ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబుకు రామ్మెహనరావు లేఖ రాశారు. సుదీర్ఘకాలం నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఎన్నో పదవులు చేసిన తాను కార్పొరేషన్ డైరెక్టర్ పదవి తీసుకోవడానికి సుముఖంగా లేనని, తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు, లోకేశ్‌ల నాయకత్వంలో పనిచేస్తానని పేర్కొన్నారు.

News September 9, 2025

మృతుడి జేబులో నాలుగు సెల్ ఫోన్లు..వీడని మిస్టరీ

image

ఇరగవరం మండలం అయినపర్రు గ్రామ శివారులో పంటచేలలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీ వీడలేదు. సోమవారం సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే మృతుడు జేబులో నాలుగు సెల్ ఫోన్లు ఉండడం, మృతదేహం కుళ్లిన దశలో లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇరగవరం ఎస్ఐ జానా సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 9, 2025

ఎరువులు కృత్రిమ కొరతను సృష్టిస్తే తీవ్ర కఠిన చర్యలు: కలెక్టర్

image

ఉద్దేశపూర్వకంగా ఎరువులు కృత్రిమ కొరతను సృష్టిస్తే తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. జిల్లాలో ఎరువులు కొరత లేదని, రైతులు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎరువులు కొరత లేని జిల్లాలలో పశ్చిమగోదావరి జిల్లా తొలి స్థానంలో ఉందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు.