News September 4, 2025

MHBD: విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి: కలెక్టర్

image

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఆయన గుమ్మడూరు గురుకుల బాలుర పాఠశాలను తనిఖీ చేసి, వంటగదులను పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయాలని, విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News September 5, 2025

వేంసూరు: నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి

image

వేంసూరు మండలంలో జరిగిన గణేశ్ నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి వి.వెంకటాపురం గ్రామంలో నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్ పైనుంచి షేక్ రషీద్ (20) అనే యువకుడు కిందపడి మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న రషీద్ స్నేహితుడికి డ్రైవింగ్ ఇచ్చి పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు.

News September 5, 2025

అందుకే విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకున్నా: రేవంత్

image

TG: తెలంగాణ ఉద్యమంలో టీచర్లదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేశారని గుర్తు చేశారు. శిల్పకళావేదికలో గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చాలా చోట్ల కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందడం లేదని తెలిపారు. పదేళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని పేర్కొన్నారు.

News September 5, 2025

GWL: చిన్నారులకు డాక్టర్ చేయూత..!

image

మల్లకల్ మండలం తాటికుంట రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన రాముడు, సంధ్య పిల్లలకు గద్వాల కు చెందిన డాక్టర్ హర్షవర్ధన్ మానవతా దృక్పథంతో రూ. 20 వేలు ఆర్థిక సహాయం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు చెక్కు అందజేశారు. వారి ఆరోగ్యం ఇతర అవసరాలకు ఆదుకుంటానని హామీ ఇచ్చారు. విండో చైర్మన్ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.