News September 4, 2025
WGL: నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

వినాయక నిమజ్జనం సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై-సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు గురువారం ఉదయం నుండి సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. వాహనదారులు సహకరించాలని సీపీ కోరారు.
Similar News
News September 7, 2025
దుర్గాడ చెరువులో పడి యువకుడి మృతి

గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకటేష్ (25) శనివారం మధ్యాహ్నం భోజనం చేసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం దుర్గాడ కొత్తచెరువు ప్రాంతంలో యువకుడి మృతదేహం లభించింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 7, 2025
ఫోన్ ఛార్జర్‌ను సాకెట్‌లో వదిలేస్తున్నారా?

చాలామంది ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ ఫుల్ కాగానే ఛార్జర్‌ను అలాగే సాకెట్‌లో వదిలేస్తారు. కానీ ఇలా చేయొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇలా చేస్తే వోల్టేజ్ పెరిగినప్పుడు ఛార్జర్ పేలిపోవచ్చు. అంతర్గత భాగాలు వేడెక్కి అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. స్విచ్ ఆఫ్ చేసినా ఛార్జర్ కొంత మేర విద్యుత్ ఉపయోగిస్తూనే ఉంటుంది. దీంతో విద్యుత్ వృథా అవుతుంది. అన్‌ప్లగ్ చేయడం ఉత్తమం’ అని చెబుతున్నారు.
News September 7, 2025
ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్

AP: కర్ణాటకలోని ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి మఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదిచుంచనగిరి మఠం నిర్వహించే సంవిత్ పాఠశాలలను పరిశీలించారు. APలో పేదల కోసం సంవిత్ బడులు ప్రారంభించాలని కోరగా, పీఠాధిపతి జగద్గురు శ్రీనిర్మలానందనాథ మహాస్వామిజీ అంగీకారం తెలిపారు.