News September 4, 2025
వీటిపై త్వరలో 40శాతం జీఎస్టీ!

లగ్జరీ వస్తువులపై త్వరలో 40 శాతం పన్ను విధిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్‌మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై ఈ మేరకు జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్‌పై 40శాతం పన్ను ఉంటుందని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న 28శాతం శ్లాబులే కొనసాగనుండగా, త్వరలో 40 శాతం అమలు చేస్తామన్నారు.
Similar News
News September 5, 2025
టాప్-100లో ఏపీ& TG నుంచి ఏడు కాలేజీలు

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ఈ ఏడాది విడుదల చేసిన అత్యున్నత విద్యాసంస్థల ర్యాంకుల్లో తమిళనాడు టాప్‌లో ఉంది. టాప్-100లో తమిళనాడులోనే 17 ఉండటం విశేషం. ఆ తర్వాత మహారాష్ట్రలో 11, UPలో 9, ఢిల్లీలో 8, కర్ణాటకలో & పంజాబ్‌లో 6, TGలో 5 కాలేజీలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రెండు మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. APలో AU & KLU, TGలో IIT-HYD, NIT WGL, OU, IIIT-HYD,JNTUH ఉన్నాయి.
News September 5, 2025
శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కోఠారి నుంచి రూ.60కోట్లు తీసుకొని మోసం చేశారన్న అభియోగాలపై వీరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు వీరి ట్రావెల్ లాగ్‌లను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక నేరాల విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో దంపతులు దేశం వదిలి వెళ్లకుండా నోటీసులిచ్చారు.
News September 5, 2025
పులివెందులకు ఉపఎన్నిక ఖాయం: రఘురామ

AP: ఈసారి వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్‌క్వాలిఫై అవుతారని, పులివెందులకు ఉపఎన్నిక ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఓ MLA 60 రోజులపాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని ఆయన తెలిపారు. ‘మాజీ CM అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుతున్నా. ప్రతిపక్ష హోదా కోసం ఆయన చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు.