News April 3, 2024
బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడిపై పోక్సో కేసు

బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన రేపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రేపల్లె 8వ వార్డుకు చెందిన 4వ తరగతి చదివే బాలికపై సాయి పవన్ (23) అత్యాచారానికి పాల్పడ్డాడు. మచిలీపట్నంలో కూలి పనులు చేసుకునే సాయి పవన్ ఇటీవల రేపల్లె వచ్చాడు. ఆడుకుంటున్న బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Similar News
News March 21, 2026
GNT: PACS ఉద్యోగులకు డిగ్రీ నిబంధనపై అసంతృప్తి

PACS సిబ్బందికి ప్రమోషన్ల కోసం డిగ్రీ అర్హత తప్పనిసరి చేయడం వివాదంగా మారింది. ఉమ్మడి GNT జిల్లాలో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఉద్యోగులు దీనిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 20ఏళ్లకు పైగా సేవ చేస్తున్న వారిని ఇప్పుడు చదువు పూర్తి చేయాలని కోరడం కష్టమని అంటున్నారు. 2020లో రూపొందించిన HR పాలసీ అమలు కాకపోయినా కొత్త నిబంధనలు తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యోగులు మరికొంత గడువు ఇవ్వాలంటున్నారు.
News March 21, 2026
సామాన్యుడిలా తిరుమల దర్శనం చేసుకున్న సీఎం చంద్రబాబు

సీఎం హోదాలో ఉన్న ప్రొటోకాల్ పక్కనపెట్టి సామాన్యుడిలా క్యూ కాంప్లెక్స్ వెళ్లి చంద్రబాబు కుటుంబం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఇవాళ దర్శనం చేసుకుంది. శనివారం మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ మార్గంలో వెళ్తూ టీటీడీ ఏర్పాట్లు, భక్తుల ఇబ్బందులు చంద్రబాబు పరిశీలించి స్వయంగా తెలుసుకున్నారు. లోపాలను వెంటనే సరిదిద్దాలని టీటీడీ అధికారులకు సూచించారు.
News March 21, 2026
గుంటూరు: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ‘మిషన్ వాత్సల్య’ కింద కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కౌన్సిలర్, మేనేజర్, స్టోర్ కీపర్, హెల్పర్, పీటీ, యోగా టీచర్ తదితర ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు మార్చి 23 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు guntur.ap.gov.in వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చు.


