News September 4, 2025
పలువురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగులు

AP: రాష్ట్ర ప్రభుత్వం IASల బదిలీలు, పోస్టింగులు చేపట్టింది. సర్వే సెటిల్‌మెంట్స్&ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా R.కూర్మనాథ్, తూ.గో. జాయింట్ కలెక్టర్‌గా వై.మేఘస్వరూప్, గుంటూరు JCగా A.శ్రీవాస్తవ, మన్యం JCగా సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, అల్లూరి(D) పాడేరు ITDA POగా తిరుమాని శ్రీపూజ, AP విజిలెన్స్ జాయింట్ సెక్రటరీగా కె.ఆర్.కల్పశ్రీ, విశాఖ(D) రంపచోడవరం ITDA POగా స్మరణ్‌రాజ్‌లను నియమించింది.
Similar News
News September 7, 2025
ఫోన్ ఛార్జర్‌ను సాకెట్‌లో వదిలేస్తున్నారా?

చాలామంది ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ ఫుల్ కాగానే ఛార్జర్‌ను అలాగే సాకెట్‌లో వదిలేస్తారు. కానీ ఇలా చేయొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇలా చేస్తే వోల్టేజ్ పెరిగినప్పుడు ఛార్జర్ పేలిపోవచ్చు. అంతర్గత భాగాలు వేడెక్కి అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. స్విచ్ ఆఫ్ చేసినా ఛార్జర్ కొంత మేర విద్యుత్ ఉపయోగిస్తూనే ఉంటుంది. దీంతో విద్యుత్ వృథా అవుతుంది. అన్‌ప్లగ్ చేయడం ఉత్తమం’ అని చెబుతున్నారు.
News September 7, 2025
ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్

AP: కర్ణాటకలోని ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి మఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదిచుంచనగిరి మఠం నిర్వహించే సంవిత్ పాఠశాలలను పరిశీలించారు. APలో పేదల కోసం సంవిత్ బడులు ప్రారంభించాలని కోరగా, పీఠాధిపతి జగద్గురు శ్రీనిర్మలానందనాథ మహాస్వామిజీ అంగీకారం తెలిపారు.
News September 7, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక..‘ఇండీ’ ఎంపీలకు మాక్ పోలింగ్

ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న క్రమంలో రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఇండీ కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడం ఎంపీల బాధ్యత అని, ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని సూచించారు.