News September 4, 2025
WGL: డ్రోన్‌తో యూరియా పిచికారీ ప్రదర్శన.. పరిశీలించిన జిల్లా కలెక్టర్

గీసుగొండ మండలం తిమ్మాపురంలో రైతులకు అవగాహన కల్పించేందుకు డ్రోన్ సాయంతో నానో యూరియా పిచికారీ ప్రదర్శనను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై పరిశీలించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ రైతులకు వివరించారు. ఉత్పాదకత పెంపుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News September 6, 2025
నిమజ్జనాన్ని పరిశీలించిన వరంగల్ కలెక్టర్

నర్సంపేటలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వరంగల్ కలెక్టర్ సత్య శారద శుక్రవారం రాత్రి పరిశీలించారు. పట్టణ శివారు దామర చెరువు వద్ద కొనసాగుతున్న నిమజ్జనాన్ని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. ఎన్ని విగ్రహాలు, ఏర్పాట్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ, ఆర్డీవో ఉమరాణి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తదితరులున్నారు.
News September 5, 2025
వరంగల్: రేషన్ షాపుల బంద్ సక్సెస్..!

రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రేషన్ షాపుల ఒకరోజు బంద్ కార్యక్రమం వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 29 ప్రభుత్వం నిర్వహించే షాపులు మినహా మిగతా షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించకపోతే త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ధారావత్ మోహన్ నాయక్ అన్నారు.
News September 5, 2025
వరంగల్ జిల్లాలో ముందస్తు గురు పూజోత్సవాలు..!

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. కానీ మిలాద్ ఉన్ నబి పండుగ, గణపతి నిమజ్జనం ఉండడంతో ప్రభుత్వం అధికారిక హాలిడే ప్రకటించింది. దీంతో ఆయా పాఠశాలల్లో ముందస్తుగానే వర్ధన్నపేట ఉప్పరపల్లిలో సర్వేపల్లి చిత్రపటానికి నివాళులర్పించారు.