News September 4, 2025

రాజమండ్రి: గోదావరి పుష్కరాలకు ముందస్తుగా కర్టైన్ రైజర్ ప్రోగ్రామ్

image

గోదావరి పుష్కరాలకు సంబంధించి ముందస్తుగా కర్టైన్ రైజర్ కార్యక్రమం నిర్వహిద్దామని మంత్రి కందుల దుర్గేష్ సూచించగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. పర్యాటక శాఖపై బుధవారం సీఎం నిర్వహించిన సమీక్షలో వర్చువల్‌గా మంత్రి దుర్గేశ్ పాల్గొన్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు క్రింద చేపట్టిన హేవలాక్ బ్రిడ్జిని త్వరితగతిన  పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని దుర్గేశ్ తెలిపారు.

Similar News

News September 7, 2025

వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి: ఎస్పీ

image

వినాయక చవితి వేడుకలు, మిలాద్ – ఉన్ – నబీ వేడుకలు జిల్లాలో శాంతియుతంగా జరిగాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ఈ పండుగలు మత సామరస్యాన్ని చాటి చెప్పాయన్నారు. విజయవంతంగా వేడుకలు నిర్వహించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. సహకరించిన కమిటీలు, రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 7, 2025

ధవలేశ్వరం: తగ్గుముఖం పట్టిన వరద

image

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శనివారం రాత్రి 9 గంటలకు 7,38,035 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 14,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 7, 2025

రాజమండ్రి: కేసుల దర్యాప్తుకు కొత్త జాగిలాలు

image

కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపులో పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త జాగిలాలు వచ్చినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ తెలిపారు. ఈ నూతన జాగిలాల చేరికతో దర్యాప్తు మరింత శక్తివంతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ‘రాడో’ అనే జాగిలం శిక్షణ కాలంలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానం సాధించిందని ప్రశంసించారు. డాగ్ హ్యాండ్లర్ల కృషిని ఆయన అభినందించారు.