News September 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News September 4, 2025
అప్పటివరకు పాత శ్లాబ్‌లోనే సిగరెట్, గుట్కా, బీడీ

కొత్తగా తీసుకొచ్చిన GST సంస్కరణలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. అయితే SIN(హానికర) ట్యాక్స్ పరిధిలో ఉన్న సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, టొబాకో, జర్దా, బీడీలపై విధించిన 40% ట్యాక్స్ అమల్లోకి రావడానికి మరింత సమయం పట్టనుంది. తదుపరి తేదీ ప్రకటించే వరకు ఇవి 28% శ్లాబ్‌లోనే కొనసాగనున్నాయి. ప్రస్తుతం సిగరెట్లపై సైజ్‌లను బట్టి GST, సెస్ కలిపి గరిష్ఠంగా 64% ట్యాక్స్ అమల్లో ఉంది.
News September 4, 2025
అన్ని కార్ల ధరలు తగ్గుతాయ్..

కొత్త జీఎస్టీ విధానంలో లగ్జరీ <<17606719>>కార్లను<<>> 40% శ్లాబులోకి (గతంలో 28%) తెచ్చారు. అయితే ఇంజిన్ కెపాసిటీతో సంబంధం లేకుండా అన్ని కార్ల ధరలు తగ్గుతాయని మీకు తెలుసా? ఎలా అంటే..
*ప్రస్తుతం 1200 cc (పెట్రోల్ ఇంజిన్) కంటే ఎక్కువ ఉన్న కార్లపై 28% జీఎస్టీతో పాటు 22% సెస్ వేస్తున్నారు. దీంతో పన్ను 50% పడుతోంది. కొత్త విధానంలో 40% జీఎస్టీలోకి తెచ్చారు. కానీ సెస్ పూర్తిగా తొలగించారు. దీంతో 10% పన్ను మిగిలినట్లే..
News September 4, 2025
స్వాగతిస్తున్నాం.. కానీ చాలా ఆలస్యమైంది: చిదంబరం

GST సంస్కరణలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, MP చిదంబరం స్పందించారు. ‘జీఎస్టీ హేతుబద్ధీకరణ, గూడ్స్&సర్వీసెస్‌పై ట్యాక్స్ తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ చాలా ఆలస్యమైంది. 8 ఏళ్ల క్రితం GST ప్రవేశపెట్టినప్పుడే ఈ పని చేయాల్సింది. ఇంతకాలం రేట్లను తగ్గించాలని మేం ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? ట్రంప్ సుంకాలా? బిహార్ ఎన్నికలా?’ అని ప్రశ్నించారు.