News September 4, 2025
GST సంస్కరణలను స్వాగతిస్తున్నాం: CBN

AP: GST సంస్కరణలపై CM చంద్రబాబు స్పందించారు. ‘నిత్యావసరాలతో పాటు విద్య, ఆరోగ్యం, వ్యవసాయానికి సంబంధించి GST శ్లాబుల సవరణను స్వాగతిస్తున్నాం. పేదలకు మేలు చేసే, అభివృద్ధికి దోహదపడే ఈ నిర్ణయం రైతుల నుంచి వ్యాపారుల వరకు సమాజంలోని అన్ని వర్గాలకు లాభదాయకంగా ఉండనుంది. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు అభినందనలు. ఈ సంస్కరణలు ప్రతి భారతీయుడికి మెరుగైన జీవితాన్ని అందిస్తాయి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 5, 2025
చీర కట్టు.. ఆరోగ్యానికి మెట్టు

ఇంట్లో ఫంక్షన్లు, పండుగలకు తప్ప మహిళలు చీరలు కట్టుకోవడం బాగా తగ్గింది. అయితే రోజూ చీరను ధరించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. చీర భారతీయ సంస్కృతి, సంప్రదాయ, గౌరవానికి చిహ్నం. చీర థర్మోస్‌లాగా పనిచేసి వేసవిలో శరీరాన్ని చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. చీర వదులుగా ఉండటం వలన రక్తప్రసరణ బాగుంటుంది. అలాగే చీర మనలో పాజిటివ్ ఎనర్జీని, కాన్ఫిడెన్స్‌ను తీసుకొస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
News September 5, 2025
శానిటరీ ప్యాడ్స్కూ ఎక్స్పైరీ డేట్

మహిళలు పీరియడ్స్‌లో న్యాప్‌కిన్స్, మెన్‌స్ట్రువల్ కప్స్, ట్యాంపన్స్ వాడతారు. కానీ వీటి ఎక్స్‌పైరీడేట్ గురించి పట్టించుకోరు. ఎక్స్‌పైర్ అయిన ప్రొడక్ట్స్‌పై బ్యాక్టీరియా, వైరస్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటిని వాడితే జననేంద్రియాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటిని వినియోగించేముందు లేబుల్‌ని తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు.
News September 5, 2025
IBలో 455 ఉద్యోగాలు

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 455 సెక్యూరిటీ అసిస్టెంట్(మోటార్ ట్రాన్స్‌పోర్ట్) ఉద్యోగాలకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, ఒక ఏడాది అనుభవం, మోటార్ మెకానిజం పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. 18-27ఏళ్ల వయసుండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, డ్రైవింగ్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
వెబ్‌సైట్: https://www.ncs.gov.in/