News September 4, 2025
HYD: బైక్, కారు కడిగాడు.. రూ.10 వేలు జరిమానా

HYD బంజారాహిల్స్‌లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్‌ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.
Similar News
News September 7, 2025
ఆదిలాబాద్: ‘బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం’

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తోందన్నారు. నాయకులు రవీంద్ర, జంగుబాపు, రమేశ్, జగన్మోహన్, తుకారాం తదితరులు ఉన్నారు.
News September 7, 2025
సీఎం కలల ప్రాజెక్టు గురించి తెలుసా?

TG: సీఎం రేవంత్ కలల ప్రాజెక్టుగా ఉన్న <<17640080>>మూసీ<<>> పునరుజ్జీవన పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024లోనే CM ప్రకటన చేశారు. తర్వాత నది తీర ప్రాజెక్టుల అధ్యయనానికి రేవంత్ బృందం UK, దక్షిణ కొరియాలో పర్యటించింది. ఆక్రమణల తొలగింపుపై వ్యతిరేకత నడుమ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ADB ₹4,100 కోట్ల రుణాన్ని ప్రకటించింది. మరోవైపు ప్రధాన భాగాలకు సంబంధించి మూడు DPRలు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి.
News September 7, 2025
HYD: మైనర్ బాలికపై అత్యాచారం

మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సిటీ శివారులో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. శనివారం రాత్రి యాచారం మం. పరిధిలోని ఓ గ్రామంలో బాలికకు మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు. ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. మరొకడు అత్యాచారానికి యత్నించాడు. ఆదివారం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం సిటీలోని ఓ ఆస్పత్రికి తరలించారు.