News September 4, 2025

GREAT.. 10th చదివి ఆర్థిక క్రమశిక్షణతో రూ.కోటి పొదుపు!

image

ఆర్థిక క్రమశిక్షణతో ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన ఓ వ్యక్తి కథ నెటిజన్లను మెప్పిస్తోంది. తాను పదో తరగతి మాత్రమే చదివి 25 ఏళ్లలో రూ.కోటి పొదుపు చేసినట్లు 53 ఏళ్ల వ్యక్తి రెడిట్‌లో పోస్ట్ చేయగా వైరలవుతోంది. తాను నెలకు రూ.4,200 జీతంతో జీవితాన్ని ప్రారంభించానని, ఎప్పుడూ అప్పు చేయలేదని, క్రెడిట్ కార్డు వాడలేదని తెలిపారు. చాలావరకూ నడుస్తూనే వెళ్తానని, ఈ మధ్యే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నానన్నారు.

Similar News

News September 5, 2025

రబీ సీజన్‌కు 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

image

AP: రబీ సీజన్ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. యూరియా స్టాక్, సప్లై, పంపిణీపై పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో యూరియా కొరత ఉంది. ఆ జిల్లాల్లో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి. యూరియా నిల్వల్లో తేడా లేకుండా చూసుకోవాలి’ అని ఆదేశించారు.

News September 5, 2025

నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు: CP

image

TG: HYD వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. గతేడాది డీజే చప్పుళ్లతో చాలామంది ప్రాణాలు కోల్పోయారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా సహకరిస్తోందన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ఉ.6 గంటలకు ప్రారంభమై మ.1.30 గంటలలోపు పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 29వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 5, 2025

చీర కట్టు.. ఆరోగ్యానికి మెట్టు

image

ఇంట్లో ఫంక్షన్లు, పండుగలకు తప్ప మహిళలు చీరలు కట్టుకోవడం బాగా తగ్గింది. అయితే రోజూ చీరను ధరించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. చీర భారతీయ సంస్కృతి, సంప్రదాయ, గౌరవానికి చిహ్నం. చీర థర్మోస్‌లాగా పనిచేసి వేసవిలో శరీరాన్ని చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. చీర వదులుగా ఉండటం వలన రక్తప్రసరణ బాగుంటుంది. అలాగే చీర మనలో పాజిటివ్ ఎనర్జీని, కాన్ఫిడెన్స్‌ను తీసుకొస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.