News September 4, 2025

చేగుంట వద్ద ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన

image

చేగుంట వద్ద వడియారం, మాసాయిపేట స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నెం. 228 స్థానంలో ఆర్‌ఓబీ, ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణానికి ఈనెల 4న ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, అంజిరెడ్డి, కొమురయ్య, రైల్వే అధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. దీంతో ఆర్ఓబీ ట్రాఫిక్ సమస్య తీరనుంది.

Similar News

News September 7, 2025

దళితులపై దాడి.. ఏడుగురు నిందితుల అరెస్టు

image

కైకలూరు పట్టణ పరిధిలో శుక్రవారం రాత్రి గణేశ్ నిమజ్జనాల ఊరేగింపు కొనసాగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో కైకలూరు టౌన్‌లో శుక్రవారం రాత్రి గణేశ్ నిమజ్జనంలో బండి హారన్ కొట్టడంతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో దాన గూడెం కి చెందిన కొందరు గాయాల పాలయ్యారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

News September 7, 2025

మెట్రో టెండర్ల గడువు పొడిగింపు

image

AP: విజయవాడ, విశాఖ మెట్రో టెండర్ల గడువు పొడిగించినట్లు AP మెట్రో రైల్‌ కార్పొరేషన్ MD రామకృష్ణారెడ్డి తెలిపారు. VJA మెట్రో టెండర్ల గడువు అక్టోబరు 14, విశాఖకు సంబంధించి అక్టోబరు 7వరకు పొడిగించామన్నారు. టెండర్ల ప్రీబిడ్‌ సమావేశంలో కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి వినతులు రాగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విశాఖ మెట్రో ఫేజ్‌-1 కింద 46.23KM, VJA మెట్రో ఫేజ్‌-1లో 38KM నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు.

News September 7, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాల్లో మార్పులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ స్టేషన్లలో కొన్నింటిని మార్చారు. బోరబండ ఎన్ఆర్ఆర్‌పురంలోని రెండు అదనపు బూత్‌లను సాయిబాబానగర్ ప్రభుత్వ స్కూల్‌కు మార్చారు. ఎల్లారెడ్డిగూడ రేడియంట్ స్కూల్లోని అదనపు కేంద్రాన్ని పడాల రామిరెడ్డి లా కాలేజీలోకి మార్చారు. అమానత్ పాఠశాలలో అదనపు బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆనంద్ విద్యాలయ కిడ్స్ స్కూల్, యూసఫ్‌గూడ వార్డు కార్యాలయంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.