News September 4, 2025
అలాంటి లింకులపై క్లిక్ చేయొద్దు: ఎస్పీ

గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఏపీకే పేరుతో వచ్చే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దన్నారు. వివిధ వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తే వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దన్నారు. మీ అనుమతులు లేకుండా ఏవైనా లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కు కాల్ చేయాలన్నారు.
Similar News
News September 4, 2025
ధవన్‌కు ఈడీ నోటీసులు

టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై ఆయన్ను ప్రశ్నించనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ఇప్పటికే ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
News September 4, 2025
నెల్లూరు జిల్లా విద్యార్థులకు గమనిక

నెల్లూరు జిల్లాలోని విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(NMMS)కు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని DEO ఆర్.బాలాజీ రావు ఓ ప్రకటనలో సూచించారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. డిసెంబర్ 7వ తేదీన పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 4, 2025
ప్రకాశం: పల్లెలో ఎన్నికల నగారా.. అంతా సిద్ధమేనా!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పల్లె రాజకీయం జోరందుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం మూడు నెలల ముందే నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో జనవరిలోనే ‘పల్లె పోరు’ జరిగే ఛాన్సుంది. జిల్లాలో మొత్తం 730 గ్రామ పంచాయతీలు (సర్పంచ్ స్థానాలు) ఉన్నాయి. 56 జడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీలు, ఒంగోలు, కనిగిరి, పొదిలి, దర్శి, మార్కాపురం, అద్దంకి, చీరాల, కందుకూరు తదితర పురపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.