News September 4, 2025
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శేషఫణి ఎంపిక

నంద్యాల పట్టణ సమీపంలోని బలపనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శేషఫణి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. శేషఫణి పనిచేసిన పాఠశాలలలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఈనెల 5న విజయవాడలో జరిగే గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందుకోబోతున్నారు. పట్టణ ప్రముఖులు శేషఫణికి అభినందనలు తెలిపారు.
Similar News
News September 5, 2025
HYD: రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్న వెంకన్న

తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డా.గడ్డం వెంకన్న ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్నారు. శుక్రవారం HYDలోని శిల్పారామంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో VC ఆచార్య నిత్యానందరావు పాల్గొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ అధ్యాపకులు, ఉమ్మడి జిల్లా నేతలు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
News September 5, 2025
కామారెడ్డి: 300 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలతో నిఘా

కామారెడ్డిలో గణేశ్ నిమజ్జన, శోభాయాత్రల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. 300 మంది పోలీసులు, 120 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని SP కోరారు.
News September 5, 2025
మెదక్: నిమజ్జనంలో విషాదం.. యువకుడు మృతి

హవేలీఘనపూర్ మండలం తొగిట గ్రామంలో గణేశ్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఓ యువకుడు నీట మునిగి మరణించాడు. గ్రామానికి చెందిన మొండి ప్రభాకర్ కుమారుడు సుధాకర్(17) శుక్రవారం సాయంత్రం రామస్వామి కుంట వద్ద నిమజ్జనం అనంతరం కనిపించకుండా పోయాడు. నిర్వాహకులు, గ్రామస్థులు వెతకగా, అతని మృతదేహం బయటపడింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.