News September 4, 2025
స్వాగతిస్తున్నాం.. కానీ చాలా ఆలస్యమైంది: చిదంబరం

GST సంస్కరణలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, MP చిదంబరం స్పందించారు. ‘జీఎస్టీ హేతుబద్ధీకరణ, గూడ్స్&సర్వీసెస్‌పై ట్యాక్స్ తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ చాలా ఆలస్యమైంది. 8 ఏళ్ల క్రితం GST ప్రవేశపెట్టినప్పుడే ఈ పని చేయాల్సింది. ఇంతకాలం రేట్లను తగ్గించాలని మేం ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? ట్రంప్ సుంకాలా? బిహార్ ఎన్నికలా?’ అని ప్రశ్నించారు.
Similar News
News September 4, 2025
అవినీతిపరులను మా పార్టీలో చేర్చుకోం: రామ్‌చందర్

TG: అవినీతిపరులను బీజేపీలో చేర్చుకోబోమని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రామ్‌చందర్ రావు స్పష్టం చేశారు. కవితను బీజేపీలో చేర్చుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కవిత వ్యాఖ్యలపై తాను స్పందించనని, మీడియా వాళ్లు కూడా ఆమె చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. స్టాలిన్ మీటింగ్‌కు, గవర్నర్ వద్దకు రెండు పార్టీలు కలిసే వెళ్లాయి కదా’ అని ఉదహరించారు.
News September 4, 2025
రేపు ఏ సినిమాకు వెళ్తున్నారు?

రేపు 5 ఆసక్తికర సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘ఘాటి’, ఏఆర్ మురుగదాస్, శివకార్తికేయన్ కాంబోలో రూపొందిన ‘మదరాసి’, వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ‘ది బెంగాల్ ఫైల్స్’, మౌళి&శివాని నటించిన ‘లిటిల్ హార్ట్స్’, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన ‘బాఘి 4’ (హిందీ) విడుదల అవుతున్నాయి. వీటిలో మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు? కామెంట్ చేయండి.
News September 4, 2025
కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్

కేంద్రం GST శ్లాబులను తగ్గించడం కొత్తగా ఇళ్లు కట్టుకునేవారికి ఎంతో ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘సిమెంట్, గ్రానైట్, మార్బుల్, ఇటుకల వంటి ముఖ్యమైన నిర్మాణ సామగ్రిపై GST 12% నుంచి 5%/ 28% – 18% తగ్గడంతో నిర్మాణ వ్యయం తగ్గనుంది. దీంతో మొత్తం నిర్మాణ వ్యయంలో సుమారు 5% వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఇళ్ల ధరలు తగ్గి సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’ అని అంచనా వేస్తున్నారు.