News September 4, 2025
మామిడికుదురు: దివ్యాంగురాలిపై అత్యాచారం

మామిడికుదురు మండలంలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల దివ్యాంగ బాలికపై అదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడని స్థానికులు తెలిపారు. బాలిక గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యులు రహస్యంగా గర్భస్రావం చేయించారు. గ్రామ పెద్దలు రాజీ చేసి, బాధితులకు డబ్బు చెల్లించేలా ఒప్పందం కుదిర్చారని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.
Similar News
News September 5, 2025
ఆమదాలవలసలో వివాహిత సూసైడ్

ఆమదాలవలస మండలం చిట్టివలసకు చెందిన పూర్ణ (22) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 4 నెలల కిందట ఈమెకు వివాహమైంది. అప్పటి నుంచే ఆమె వరకట్న వేధింపులను తాళలేక పుట్టింటికి వచ్చేసింది. అనంతరం పెద్దల సమక్షంలో అత్తారింటికెళ్లిన పరిస్థితి మారలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నెల 2న ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదైంది.
News September 5, 2025
నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్

భూపాలపల్లి పట్టణంలో గణపతి నిమజ్జనం సందర్భంగా ధర్మవాహిని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
News September 5, 2025
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి టీజీ భరత్

కర్నూలు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి టీజీ భరత్ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, హాస్పిటల్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అంతకు ముందు పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ ప్రతినిధులు మంత్రి చేతుల మీదుగా 10 స్ట్రెచర్లను హాస్పిటల్‌కు ఇచ్చారు.