News September 4, 2025

KNR: ఈ నెల 6న జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్స్ యోగా పోటీలు

image

అంబేడ్కర్ స్టేడియంలో ఈ నెల 6న జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగాసన ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సర్దార్ రవీందర్ సింగ్, నాగిరెడ్డి సిద్ధారెడ్డిలు తెలిపారు. 8-18 సం.ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు బెర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో ఈ నెల 6న ఉ.9 గం.కు కోచ్లు వద్ద నమోదు చేసుకోవాలన్నారు. 8985275068 సంప్రదించాలన్నారు

Similar News

News September 6, 2025

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. ఆగిన గణపయ్య రథం..!

image

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో కరీంనగర్‌లో కొలువైన 35 అడుగుల భారీ గణేష్ శోభాయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ విద్యుత్ తీగలు తొలగించకపోవడంతో శోభాయాత్ర ఆగిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారుల కోసం “మిత్రా యూత్” నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి శోభాయాత్ర సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News September 6, 2025

కరీంనగర్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డా.కాంపల్లి అర్జున్

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYDలోని శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహించింది. ఈ మేరకు KNRలోని SRR ప్రభుత్వ కళాశాలలో వాణిజ్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డా.కాంపల్లి అర్జున్ తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకున్నారు. అర్జున్ మాట్లాడుతూ.. ఈ అవార్డు ఉపాధ్యాయుడి కృషికి రాష్ట్రం ఇచ్చిన గౌరవమన్నారు.

News September 5, 2025

KNR: వినాయక నిమజ్జనం.. పోలీసుల సూచనలు

image

శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ పోలీసులు పలు సూచనలు చేశారు.
☞ విగ్రహాలు కరెంటు వైర్లకు తగలకుండా చూసుకోవాలి.
☞ క్రేన్ల ద్వారా మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలి.
☞ ఈత రానివారు నీటి వద్దకు వెళ్లకూడదు.
☞ హైటెన్షన్ వైర్ల వద్ద విగ్రహాలను జాగ్రత్తగా తీసుకెళ్లాలి.
☞ వాహనాల్లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జనంలో పాల్గొనండి.