News April 3, 2024

LS ఎన్నికల్లో యంగెస్ట్ కంటెస్టెంట్

image

2024లోక్‌సభ ఎన్నికల్లో 25ఏళ్ల శాంభవీ చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలవనున్నారు. బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగుతున్నారు. JDU సీనియర్ లీడర్ అశోక్ చౌదరి కుమార్తె అయిన శాంభవి ప్రస్తుతం మగధ్ యూనివర్సిటీలో PhD చదువుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News November 9, 2025

పాటీదార్‌కు గాయం.. 4 నెలలు ఆటకు దూరం!

image

భారత ప్లేయర్ రజత్ పాటీదార్ నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. సౌతాఫ్రికా-ఏతో జరిగిన తొలి అన్‌అఫీషియల్ టెస్టులో ఆయన గాయపడినట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆడట్లేదని పేర్కొన్నాయి. ఈ కారణంతో ఈ నెలాఖరు, డిసెంబర్‌లో జరిగే దేశవాళీ టోర్నీలకు ఆయన దూరం కానున్నారు. మరోవైపు పాటీదార్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News November 9, 2025

శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. ఇవాళ్టి నుంచి బుకింగ్

image

అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి SCR <<18224903>>మరిన్ని<<>> ప్రత్యేక రైళ్లు నడపనుంది. కాకినాడ టౌన్-కొట్టాయం, కొట్టాయం-కాకినాడ టౌన్, నాందేడ్-కొల్లామ్, కొల్లామ్-నాందేడ్, చర్లపల్లి-కొల్లామ్, కొల్లామ్-చర్లపల్లి మీదుగా 54 రైళ్లు నడపనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవాళ ఉ.8 గంటల తర్వాత నుంచి ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్ ప్రారంభం కానుందని IRCTC వెల్లడించింది.

News November 9, 2025

రెబకినా సంచలనం..

image

సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన WTA సింగిల్స్ ఫైనల్‌లో రెబకినా విజయం సాధించారు. ప్రపంచ నం.1 టెన్నిస్ ప్లేయర్ సబలెంకాతో జరిగిన మ్యాచులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో మ్యాచ్ వన్ సైడ్ కాగా 6-3, 7-6 పాయింట్లతో ఆమె టైటిల్ గెలిచారు. ఈ విజయంతో రికార్డు స్థాయిలో 5.2 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ రెబకినా ఖాతాలో చేరనుంది. ఈ ట్రోఫీ అందుకున్న తొలి ఆసియన్, కజికిస్థాన్ ప్లేయర్‌గానూ ఆమె నిలిచారు.