News September 4, 2025

నల్లజర్ల: నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష

image

ఉమ్మడి ప.గో జిల్లా నల్లజర్ల మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన కునపాము బాబూరావుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ ఏలూరు జిల్లా సెషన్స్ జడ్జి శైఖ్ సికిందర్ బాషా బుధవారం తీర్పు చెప్పారు. 2021లో కల్లు దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో బాబూరావు ఇనుపరాడ్‌తో కొట్టడంతో చల్లారి వెంకటేశ్వరరావు మృతి చెందాడు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.

Similar News

News September 6, 2025

పెదఅమిరం: ఆధార్ బయోమెట్రిక్ ప్రక్రియ వేగవంతం చేయాలి

image

కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, ఈపీటీఎస్ ఫైల్స్ అప్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తల్లికి వందనం ఖాతాలో నగదు జమకు ఉన్న ఆటంకాలను పరిష్కరించాలన్నారు. పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ ను అప్డేట్ చేయాలని సూచించారు.

News September 6, 2025

కాళ్ళకూరు: ‘దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలి’

image

ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో ఉన్న శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఆలయం ప్రాంగణంలో జరిగింది. దేవస్థానం ఛైర్మన్‌గా వేగేశ్న రామ్మూర్తిరాజు, సభ్యులతో ఆకివీడు గ్రూపు దేవాలయాల ఈఓ అల్లూరి సత్యనారాయణరాజు ప్రమాణ స్వీకారం చేయించారు.

News September 6, 2025

కుమారుడికి ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

image

కుమారుడికి టీచర్ ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకున్న తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్తిలి మండలం బల్లిపాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కుమారుడికి DSCలో ఉద్యోగం రాకపోవడంతో గ్రామానికి చెందిన కాకర్ల ఆదినారాయణ (65) శుక్రవారం రాత్రి తణుకులోని ఓ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.