News September 4, 2025

గ్యాలరీలో ఈ ఫొటోలు పెట్టుకుంటున్నారా?

image

మొబైల్ గ్యాలరీలో ఆధార్, పాన్ కార్డ్ ఫొటోలు పెట్టుకోవద్దని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన హ్యాక్ ప్రూఫ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్‌కు సంబంధించిన ఫొటోస్ డిజీలాకర్లలో స్టోర్ చేసుకోవాలన్నారు. కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటాయని, అందుకే ఫొటోలు ఉంచడం సురక్షితం కాదని తెలిపారు.

Similar News

News September 6, 2025

రూ.217 కోట్ల నిధులు రిలీజ్

image

AP: విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం, పెండింగ్ పనుల పూర్తికి కేంద్రం మంజూరు చేసిన ₹217కోట్ల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చిన నిధులను విడుదల చేసింది. ఉపాధిహామీ కింద నిర్మిస్తున్న 2,309 భవనాల పూర్తికి, PM-ABHIM కింద 696 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. ఒక్కో భవనానికి ₹55లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

News September 6, 2025

వరద ప్రభావిత రాష్ట్రాల్లో PM మోదీ పర్యటన?

image

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వర్షాకాలంలో హిమాచల్‌ప్రదేశ్, J&K, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, ఢిల్లీలో వరదలు బీభత్సం సృష్టించాయి. సుమారు 500మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఆయా ప్రాంతాలను ప్రధాని పరిశీలించి, నష్టంపై సమీక్షిస్తారని సమాచారం.

News September 6, 2025

బీసీ సంక్షేమశాఖకు స్కోచ్ అవార్డ్

image

AP: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు వరించింది. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే BC నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందించినందుకుగానూ ఈ పురస్కారం దక్కింది. ఈ నెల 20న ఢిల్లీలో ఈ అవార్డును మంత్రి సవిత అందుకోనున్నారు. కాగా రాష్ట్రంలో BC స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్, టీచర్స్, రైల్వే వంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు శిక్షణ అందించారు.