News September 4, 2025
మెదక్: సీఎం వస్తారనుకున్నారు… కానీ రావట్లేదు..!

భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన విషాదం కనులారా వీక్షించి కాస్తయినా ఉపశమనం కలిగించేందుకు సీఎం వస్తాడని ఆశించిన అన్నదాతలు ఆవిరయ్యాయి. నేడు కామారెడ్డి జిల్లాలో సీఎం పర్యటనలో భాగంగా పోచారం ప్రాజెక్ట్ సందర్శిస్తారని ప్రచారం జరిగింది. పర్యటన షెడ్యూల్ లో లేకపోవడంతో నిరాశ చెందారు. వందలాది ఎకరాల పంట, రోడ్డు, ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. తీరని నష్టం మిగిలింది. సీఎం వస్తే కొంత ఉపశమనం కలిగేదని ఆశించారు.
Similar News
News September 7, 2025
మెదక్: 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ

భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే పునరుద్ధరించినట్లు టీజీఎస్సీపీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. మెదక్‌లోని ఎస్ఈ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 115 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన చెప్పారు.
News September 6, 2025
మెదక్: 24 గంటల్లో 110 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ: సీఈ

జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 26 నుంచి 30వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే 110 గ్రామాలకు పునరుద్ధరించినట్లు చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 115 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, అధికారులు వెంటనే స్పందించి ఎస్‌ఈ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తమ బాధ్యతలను నిర్వర్తించారని ఆయన పేర్కొన్నారు.
News September 6, 2025
మెదక్: ఆయిల్ పామ్ సాగు పెంచాలి: యాస్మిన్ బాషా

జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా సూచించారు. ప్రభుత్వం ఈ సాగుకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆమె తెలిపారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామంలో రైతు నరసింహారావు పొలంలో జరిగిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి పాల్గొన్నారు.