News September 4, 2025
ఫ్రీ బస్.. లోకల్ అడ్రస్ ఉంటే చాలు: అధికారులు

TG: అప్‌డేట్ చేయని ఆధార్ కార్డులపై రాష్ట్రం పేరు AP అని ఉంటే మహిళలకు జీరో టికెట్ ఇచ్చేందుకు కొందరు బస్ కండక్టర్లు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గ్రేటర్ RTC ED రాజశేఖర్ స్పందించారు. ఆధార్‌పై తెలంగాణ లోకల్ అడ్రస్ ఉంటే చాలని స్పష్టం చేశారు. ఒకవేళ కండక్టర్లు నిరాకరిస్తే 04069440000 TOLL FREE నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. అయితే ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే మంచిదని అధికారులు సూచించారు.
Similar News
News September 6, 2025
ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు: సుదర్శన్‌రెడ్డి

ఇండీ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న బి.సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు. ఆ స్థానంలో కూర్చునే వారికి జడ్జి లక్షణాలు అవసరం. నిష్పక్షపాతం, వివేకం, మాటలు, చేతల్లో న్యాయం ఉండాలి. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. అర్హుల ఓటు హక్కు తొలగించొద్దు’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
News September 6, 2025
దారుణం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి సూసైడ్

TG: సంగారెడ్డి(D) నిజాంపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కొత్తపల్లి ప్రమీల(23) నిన్న రాత్రి తన ఇద్దరు కుమారులు ధనుశ్(3), సూర్యవంశీ(3 నెలలు)ని గొంతు నులిమి చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కొద్ది రోజుల క్రితమే చిన్న కొడుకును ఊయలలో వేసే కార్యక్రమం పూర్తి చేసి భర్త సంగమేశ్వర్ భార్యా పిల్లలను పుట్టింటికి పంపించారు.
News September 6, 2025
సెప్టెంబర్ 6: చరిత్రలో ఈరోజు

1766: పరమాణు సిద్ధాంత ఆద్యుడు, బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ డాల్టన్ జననం(ఫొటోలో)
1892: నోబెల్ గ్రహీత సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్ జననం
1950: సుప్రసిద్ధ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం
1950: ప్రముఖ కవి, న్యాయవాది ఎన్.బాలకిషన్ రావు జననం
1949: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ జననం
2024: కవి, లిరిక్ రైటర్ వడ్డేపల్లి కృష్ణ మరణం