News September 4, 2025

ప్రకాశం: పల్లెలో ఎన్నికల నగారా.. అంతా సిద్ధమేనా!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పల్లె రాజకీయం జోరందుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం మూడు నెలల ముందే నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో జనవరిలోనే ‘పల్లె పోరు’ జరిగే ఛాన్సుంది. జిల్లాలో మొత్తం 730 గ్రామ పంచాయతీలు (సర్పంచ్ స్థానాలు) ఉన్నాయి. 56 జడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీలు, ఒంగోలు, కనిగిరి, పొదిలి, దర్శి, మార్కాపురం, అద్దంకి, చీరాల, కందుకూరు తదితర పురపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News September 6, 2025

ప్రకాశం: ఏడుగురు YCP కార్యకర్తలపై కేసు.!

image

రెడ్డిగారి ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరికి రప్పా.. రప్పా.. నేడు మీది, రేపు మాది అనే వ్యాఖ్యలను ప్రోత్సహించిన ఏడుగురుపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పొన్నలూరు SI అనుక్ తెలిపారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం పైరెడ్డిపాలెంలో ఇటీవల ఆదిమూలకు సురేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ చిన్నారులచే ప్లే-కార్డ్స్ పట్టించారనే ఆరోపనతో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News September 5, 2025

మిస్టరీగానే ప్రకాశం జిల్లా హత్య కేసు.!

image

ప్రకాశం జిల్లాలో <<17608174>>కాల్చి చంపబడిన బ్రహ్మయ్య హత్య<<>> కేసు మిస్టరీగా మారింది. దర్గా గ్రామానికి చెందిన బ్రహ్మయ్య గురువారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బ్రహ్మయ్య YCP కార్యకర్త కావడంతో నాయకులు రాజకీయ కోణంలో హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. DSP బ్రహ్మయ్య హత్య ఘటనపై స్పందిస్తూ ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్య కాదని మీడియా సమావేశంలో తెలిపారు.

News September 5, 2025

నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో మరో 500 మెట్రిక్ టన్నుల నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేసేలా అనుమతించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరుతోపాటు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.