News September 4, 2025
NZB: డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసం.. కేసు నమోదు

సైబర్ నేరగాళ్లు NZBకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ. 10 లక్షలు కాజేసినట్లు NZB సైబర్ క్రైమ్ DSP వెంకటేశ్వరరావు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు బాధితుడికి వీడియో కాల్ చేసి ‘మనీలాండరింగ్ కేసుతో మీ బ్యాంకు ఖాతాకు సంబంధం ఉంది’ అని భయపెట్టి డిజిటల్ అరెస్ట్ చేసినట్లు’ చెప్పి అతడి కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించి రూ.30 లక్షల బదిలీ చేయించుకున్నారు. బాధితుడు 1930ను సంప్రదించగా రూ. 20 లక్షలు స్తంభింపజేశారు.
Similar News
News September 7, 2025
నిజామాబాద్: 13న జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ బాలుర జట్ల ఎంపికలు

జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న శనివారం ఉదయం10 గంటలకు నిజామాబాద్‌లోని క్రీడా మైదానంలో అండర్-16 బాలుర కబడ్డీ క్రీడా ఎంపికలు జరుగుతాయని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని చెప్పారు.
News September 7, 2025
NZB: పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా బందోబస్తు పరిశీలన

నిజాముబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన రథోత్సవ వేడుకలు కన్నుల పండువ కొనసాగింది. ఇందు కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థను సీపీ సాయి చైతన్య ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడూ పరిస్థితిని పరిశీలించారు. ఈ మేరకు నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వినాయక రథోత్సవ వేడుకలను వీక్షించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టిగా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
News September 5, 2025
NZB: రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్

గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయాలని కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం దుకాణాలను తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.