News September 4, 2025

గుంటూరు వాసికి అరుదైన గౌరవం

image

గుంటూరు జిల్లాకు చెందిన రాజశేఖర్‌ కాళహస్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. బల్ద్‌విన్‌ గ్రూప్‌ చీఫ్‌ డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయనకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక నేషనల్‌ ఆర్బీ అవార్డు వరించింది. అమెరికాలో ఎంతో ప్రతిభ కనబర్చిన సీఈవోలు, టెక్‌ లీడర్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో రాజశేఖర్‌ (రాజ్‌) 2025 ఏడాదికిగానూ లార్జ్‌ కార్పొరేట్‌ విభాగంలో ఆర్బీ అవార్డును అందుకున్నారు.

Similar News

News September 8, 2025

జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ జరుగుతుంది: కలెక్టర్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం PGRS కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో తమ సిబ్బంది అర్జీలను స్వీకరిస్తారన్నారు. https://meekosam.ap.gov.in వెబ్‌సైట్లో ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 1100కి ఫోన్ చేసి కూడా తమ అర్జీ సమాచారం తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

News September 7, 2025

గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ పరీక్షలు

image

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్ల భర్తీకి గుంటూరులో ఆదివారం పరీక్షలు జరిగాయి. FBA, ABF పోస్టులకు 7,655 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 5,988 మంది హాజరయ్యారు. సెక్షన్ ఆఫీసర్ పరీక్షకు 1,492 మంది హాజరుళకావాల్సి ఉండగా.. 1,133 మంది హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి పరీక్షా కేంద్రాలతో పాటూ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను పరిశీలించారు.

News September 7, 2025

సంగీత దర్శకుడు BNR మన కొలకలూరు వారే

image

తెలుగు సినిమా సంగీత దర్శకులు భీమవరపు నరసింహరావు (బి.ఎన్.ఆర్.) గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొలకలూరులో జన్మించారు. జనవరి 24, 1905న జన్మించిన ఆయనకు 8 ఏళ్ల వయసు నుంచే సంగీతంపై ఆసక్తి కలిగింది. ఆయన మొదటి సినిమా సతీ తులసి (1936), ఆఖరి చిత్రం అర్ధాంగి (1955). సెప్టెంబర్ 7, 1976న ఆయన మరణించారు. ఆయన తెలుగు సినిమా సంగీతానికి ఎనలేని సేవలు అందించారు.