News September 4, 2025
HYD: ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్.. 2వ మెరిట్ లిస్ట్ రిలీజ్

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్- 2 ఉద్యోగాలకు సంబంధించి రెండో మెరిట్ లిస్ట్‌ను రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. మొత్తం 2,116 మంది అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉండగా వచ్చేనెల 9 నుంచి వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కార్యాయలంలో అభ్యర్థుల సర్టిఫికెట్లను సమర్పించాలని అధికారులు కోరారు. 18వ తేదీ వరకు ఈ వెరిఫికేషన్ ఉంటుందన్నారు.
Similar News
News September 11, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్.. దేశంలో సిటీ టాప్

దేశంలో రోజురోజుకూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలో ప్రతి లక్ష మంది మహిళల్లో దాదాపు 54 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్) నివేదిక పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. అధిక రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళల నగరాల్లో బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం సిటీలు తరువాత స్థానాల్లో నిలిచాయని ఐసీఎంఆర్ పేర్కొంది.
News September 11, 2025
HYD: దసరా, దీపావళి.. స్టేషన్లలో బందోబస్తు

దసరా, దీపావళి సందర్భంగా లక్షలాది మంది సొంతూళ్లకు వెళతారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి,చర్లపల్లి రైల్వే స్టేషన్ల వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ‘వెయిటింగ్ హాల్, ప్లాట్ ఫాం వద్ద నిరంతర తనిఖీలు చేయాలి. ప్రయాణికులను క్యూ లైన్లలో రైళ్లలోకి పంపించాలి. ఎంట్రీ పాయింట్ల వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
News September 11, 2025
HYD: ఇక ర్యాపిడోలో లేడీ రైడర్లు!

నగరంలో ర్యాపిడో మహిళా రైడర్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి స్కీం సభ్యులుగా ఉన్న మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు డీపీఓ ఆశా విరానిక తెలిపారు. బైక్ కొనుగోలు కూడా సర్కారే చేయూతనందిస్తుందని. కేవలం 10 శాతం చెల్లిస్తే మిగతా మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని త్వరలో సీఎం ప్రారంభిస్తారని DPO వెల్లడించారు.