News April 3, 2024
సంగారెడ్డి: నిన్న బీజేపీ.. నేడు బీఆర్ఎస్

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నిన్న బీజేపీలో చేరి, బుధవారం తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి సమక్షంలో కిషన్ రెడ్డి, మల్ రెడ్డి, బాల్‌రెడ్డి, కిరణ్ రెడ్డి, తదితరులకు పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. వారు మాట్లాడుతూ.. బలవంతంగా నిన్న బీజేపీ కండువా కప్పారని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతామన్నారు.
Similar News
News March 18, 2026
నిజాంపేట: తిప్పన్నగుల్లలో కాకతీయ కాలపు శివాలయం గుర్తింపు

నిజాంపేట మండలం తిప్పన్నగుల్లలో కాకతీయ శైలికి చెందిన పురాతన శివాలయాన్ని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయంలో శివలింగం లేకపోయినా, లతలు, సింహాలు, హంసల చెక్కడాలతో కూడిన మూడు గర్భద్వారాలు అద్భుతంగా ఉన్నాయి. శైవ ద్వారపాలకుల శిల్పాలు ఈ ఆలయ విశిష్టతను చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
News March 18, 2026
తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో నేడు కిసాన్ మేళా

కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘కిసాన్ మేళా-2026’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి స్వప్న జాదవ్ తెలిపారు. సుమారు వెయ్యి మంది రైతులతో నిర్వహించే ఈ మేళాలో ఆధునిక యంత్రాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చలు, సరికొత్త సాగు సాంకేతికతపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించనున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.