News September 4, 2025

JNTUHలో నేడు ముగియనున్న స్పాట్ అడ్మిషన్లు

image

జేఎన్టీయూ జర్మనీ యూనివర్సిటీల MOUకు సంబంధించి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ గడువు సాయంత్రంతో ముగియనుందని అడ్మిషన్ డైరెక్టర్ బాలు నాయక్ వెల్లడించారు. ఐదున్నర ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ఇన్ ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి ఈ అడ్మిషన్లను నిర్వహిస్తున్నారు. కోర్సుపై ఆసక్తి ఉన్నవారు సాయంత్రంలోగా యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News September 11, 2025

బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్.. దేశంలో సిటీ టాప్

image

దేశంలో రోజురోజుకూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలో ప్రతి లక్ష మంది మహిళల్లో దాదాపు 54 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్) నివేదిక పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. అధిక రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళల నగరాల్లో బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం సిటీలు తరువాత స్థానాల్లో నిలిచాయని ఐసీఎంఆర్ పేర్కొంది.

News September 11, 2025

HYD: దసరా, దీపావళి.. స్టేషన్లలో బందోబస్తు

image

దసరా, దీపావళి సందర్భంగా లక్షలాది మంది సొంతూళ్లకు వెళతారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి,చర్లపల్లి రైల్వే స్టేషన్ల వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ‘వెయిటింగ్ హాల్, ప్లాట్ ఫాం వద్ద నిరంతర తనిఖీలు చేయాలి. ప్రయాణికులను క్యూ లైన్లలో రైళ్లలోకి పంపించాలి. ఎంట్రీ పాయింట్ల వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.  

News September 11, 2025

HYD: ఇక ర్యాపిడోలో లేడీ రైడర్లు!

image

నగరంలో ర్యాపిడో మహిళా రైడర్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి స్కీం సభ్యులుగా ఉన్న మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు డీపీఓ ఆశా విరానిక తెలిపారు. బైక్ కొనుగోలు కూడా సర్కారే చేయూతనందిస్తుందని. కేవలం 10 శాతం చెల్లిస్తే మిగతా మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని త్వరలో సీఎం ప్రారంభిస్తారని DPO వెల్లడించారు.