News September 4, 2025

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు.. సీఎం కీలక నిర్ణయం

image

AP: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాంటి పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధివిధానాలను రూపొందించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థసారథి ఉంటారు. తప్పుడు పోస్టుల నివారణ, బాధ్యులపై కఠిన చర్యలకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కమిటీ సూచనలు చేయనుంది.

Similar News

News September 7, 2025

నేడే చంద్ర గ్రహణం.. టైమింగ్స్ ఇవే

image

నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. రాత్రి.8.58 గంటలకు గ్రహణం ప్రారంభమై, రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12.22 గంటల వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. రేపు తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం ముగుస్తుంది. భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లోనూ చంద్రగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను ఇవాళ కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు.

News September 7, 2025

ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ!

image

TG: ఈ నెల 15న కామారెడ్డిలో BC డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. BCలకు 42% శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఈ సభకు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలకు ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. మరోవైపు రేపు HYDలో జరిగే PCC విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.

News September 7, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.