News April 3, 2024

‘రాజ్యాంగ సవరణ’.. మరో బీజేపీ నేత నోట అదే మాట!

image

ఎన్నికల వేళ మరో BJP నేత రాజ్యాంగంపై కామెంట్ చేసి ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ‘దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది’ అని రాజస్థాన్‌లోని నాగౌర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధా పేర్కొన్నారు. కాగా ఇటీవల కర్ణాటక ఎంపీ అనంత్ హెగ్డే సైతం ఈ తరహా వ్యాఖ్యలు చేయగా బీజేపీ ఆయనకు టికెట్ రద్దు చేసింది.

Similar News

News October 7, 2024

కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్‌కు తేడా ఏంటి?

image

ఈ రెండూ వేర్వేరని చాలామందికి తెలీదు. గుండెకు సరిపడా రక్త ప్రవాహం లేనప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. భుజం, చెస్ట్ పెయిన్, శ్వాసతగ్గడం, అలసట, యాంగ్జైటీ, వికారం హార్ట్ అటాక్ లక్షణాలు. హార్ట్‌బీట్ ఆగిపోయి, రక్తాన్ని మిగిలిన అవయవాలకు పంప్ చేయలేకపోతే స్పృహ కోల్పోయి కుప్పకూలుతారు. దీనినే కార్డియాక్ అరెస్ట్ అంటారు. కిందపడటం, పడే ముందు తల తిరగడం, స్పృహ కోల్పోవడం, శ్వాస, హార్ట్‌బీట్ ఆగడం దీని సింప్టమ్స్.

News October 7, 2024

డబ్బులు లేవంటూ ఈ సోకులు ఎవరికోసం?: KTR

image

TG: ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టు రేవంత్ వైఖరి ఉందని మండిపడ్డారు. పొద్దున లేస్తే రాష్ట్రం అప్పులపాలైందని, డబ్బులు లేవని అరిచిన రేవంత్.. మూసీ పేరిట రూ.లక్షా యాభైవేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసమని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

News October 7, 2024

ఇన్వెస్టర్లను షేక్ చేస్తున్న Stock Markets

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లను షేక్ చేస్తున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి ఉదయం పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో మెరుగ్గా ఓపెనైన సూచీలు క్రమంగా పతనమయ్యాయి. ప్రస్తుతం NSE నిఫ్టీ 314 పాయింట్ల నష్టంతో 24,700, BSE సెన్సెక్స్ 907 పాయింట్లు తగ్గి 80,780 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.4 లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. NSEలో 2322 షేర్లు పతనమవ్వగా 239 పెరిగాయి. అన్ని రంగాల సూచీలూ డౌన్ అయ్యాయి.