News September 4, 2025
GST: సినిమా టికెట్లు, పాప్ కార్న్‌పై ఇలా..

<<17605492>>జీఎస్టీ<<>> శ్లాబుల్లో మార్పుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కాస్త ఊరట లభించనుంది. రూ.100, ఆ లోపు టికెట్లపై GSTని 12% నుంచి 5%కి కేంద్రం తగ్గించింది. అయితే రూ.100పైన టికెట్లకు మాత్రం 18% వసూలు కొనసాగనుంది. దీంతో మల్టీప్లెక్స్‌లో ఎప్పటిలాగే టికెట్ల ధరలు ఉండనున్నాయి. ఇక పాప్‌కార్న్ ధరలపై విమర్శలు ఉండగా ప్యాకేజీతో సంబంధం లేకుండా సాల్ట్ పాప్‌కార్న్ 5శాతం, క్యారమిల్ పాప్‌కార్న్ 18శాతంలోకి రానుంది.
Similar News
News February 2, 2026
ఖమ్మం పాలిటిక్స్.. పోలీసుల విలవిల

ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీల ఆధిపత్య పోరు పోలీసులకు శాపంగా మారింది. BRS నిరసనలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న వన్ టౌన్ సీఐ కరుణాకర్ చేయి విరగింది. సీఐపై దాడిని సీరియస్‌గా తీసుకున్న సీపీ సునీల్ దత్ అరుగురిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ కొందరు అధికారులు సస్పెన్షన్లు, వీఆర్ఎస్‌లతో ఇబ్బందులు పడ్డారు. పార్టీల మధ్య నలిగిపోతూ విధులు నిర్వర్తించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
News February 2, 2026
పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
News February 2, 2026
స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు పూర్తి ఊరట!

AP: చంద్రబాబు సీఎం అయ్యాక పలు కేసుల నుంచి ఉపశమనం లభిస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసు దాదాపుగా ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని CID గతంలోనే పేర్కొంది. కేసు మూసేయాలని కోరడంతో గతనెల 12న కోర్టు ఆమోదించింది. ఈ కేసుతో ఆయనకు సంబంధంలేదని ED కూడా తేల్చేసింది. దీంతో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్లు అయ్యింది.


