News September 4, 2025

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలి: BHPL కలెక్టర్

image

వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు వెంటనే చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు త్వరగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. నష్టపరిహారం పనులు త్వరగా పూర్తి చేయడానికి అంచనాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

Similar News

News September 8, 2025

VZM: రూ.40 లక్షల విలువ చేసే ఎరువులు సీజ్

image

ప్రైవేటుగా అధిక రేట్లకు ఎరువులు అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్, పోలీస్ అధికారులతో ముమ్మర తనిఖీలు జరిపించి, అధిక ధరలను అరికడతామని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం తన ఛాంబర్లో మాట్లాడుతూ.. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో 411 చోట్ల తనిఖీలు నిర్వహించి, ఒక FIR నమోదు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.40 లక్షలు విలువ గల 172 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను సీజ్ చేశామన్నారు.

News September 8, 2025

MBNR: 3,000 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతం: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,000 విగ్రహాలను నిబంధనల ప్రకారం వివిధ చెరువులు, శివార్లలో నిమజ్జనం చేశారని ఆమె చెప్పారు. కొద్ది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరిగిన గణేశ్ ఉత్సవాలు, అనంతరం నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముగిశాయని పేర్కొన్నారు.

News September 8, 2025

రూ.298 కోట్లతో కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్

image

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ఫేజ్ 2, 3, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో పాటు కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నేడు CM రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.298 కోట్లతో కోకాపేట లే అవుట్, నియోపొలిస్, స్పెషల్ ఎకనామిక్ జోన్(SEZ)లో‌ తాగునీరు, నూతన మురుగునీటి వ్యవస్థ‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కీలక ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.