News September 4, 2025
విద్యార్థుల హాజరుపై సమీక్షించాలి: అదనపు కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు సమీక్షించాలని ASF అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 50 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు రావడం లేదని, దీనికి గల కారణాలను తెలుసుకోవాలని ఆదేశించారు.
Similar News
News September 7, 2025
వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం నిత్యకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని పూలమాలతో అద్భుతంగా అలంకరించి నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తూ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
News September 7, 2025
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్?

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు <<17630461>>ఇండియా-ఏ<<>> కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పినట్లు సమాచారం. అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో విఫలమైన కరుణ్ నాయర్ స్థానంలో శ్రేయస్‌ను ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు వెస్టిండీస్‌తో అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా టీమ్‌ఇండియా రెండు టెస్టులు ఆడనుంది.
News September 7, 2025
చంద్రగ్రహణం.. ఆలయాల మూసివేత

నేడు చంద్రగ్రహణం సందర్భంగా నగరంలోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు మూసి ఉంచుతామని ఆలయ అధికారులు ప్రకటించారు. సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత మరుసటి రోజు ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తామని పండితులు తెలిపారు.