News September 4, 2025

గంజాయి కేసులో ముగ్గురికి జైలు: ఆసిఫాబాద్‌ ఎస్పీ

image

గంజాయి సాగు, సరఫరా కేసులో ముగ్గురికి ఆసిఫాబాద్‌ కోర్టు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించిందని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. గంజాయి సాగు చేసిన ఒకరు, సరఫరా చేస్తున్న ఇద్దరిపై ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకున్నా, సరఫరా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులో కృషి చేసిన పోలీసులను ఆయన అభినందించారు.

Similar News

News September 7, 2025

ప్రశాంతంగా నిమజ్జనం.. అభినందించిన సీఎం

image

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

News September 7, 2025

ప్రశాంతంగా ముగిసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు: ఎస్పీ

image

ప్రశాంతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సహకరించిన గణపతి మండపాల నిర్వాహకులకు, హిందూ సంఘాలు, మిలాద్ ఉన్ నబీ కమిటీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్విరామంగా 11 రోజుల పాటు శ్రమించిన పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామన్నారు. రాత్రింబవళ్లు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సిబ్బంది పని చేశారన్నారు.

News September 7, 2025

HYD: టస్కర్ వాహనం కిందపడి జీహెచ్‌ఎంసీ కార్మికురాలి మృతి

image

బషీర్‌బాగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక(50) మృతి చెందింది. గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఇవాళ ఉదయం బషీర్‌బాగ్–లిబర్టీ మార్గంలో విధుల్లో ఉండగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాహనం కిందపడింది. తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. పోలీసులు డ్రైవర్‌ గజానంద్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.