News September 4, 2025

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: NZB కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఆర్డీఓలు, తహశీల్దార్లతో వీసీ ద్వారా భూభారతిపై సమీక్ష జరిపి మాట్లాడారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.

Similar News

News September 7, 2025

NZB: ఆలయాల మూసివేత

image

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయాలను మూసివేశారు. నీలకంఠేశ్వరాలయం, గోల్ హనుమాన్, జెండా బాలాజీ, శంభుని గుడి, రామాలయం, శ్రీకృష్ణ టెంపుల్, సారంగపూర్ హనుమాన్ ఆలయం, రోకడ్ హనుమాన్ ఆలయం తదితర ఆలయాలను పూజారులు మూసివేశారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ చేసిన అనంతరం నిత్య పూజలు చేయనున్నారు.

News September 7, 2025

ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర: MLA ధన్పాల్

image

జెండా బాలాజీ జాతర ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర ఉందని నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం ఆయన జెండా బాలాజీ ఆలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో జిల్లా మరింత అభివృద్ధి చెందాలని, జిల్లా ప్రజలందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.

News September 7, 2025

NZB: జెండా బాలాజీ జాతరలో TPCC అధ్యక్షుడు

image

నిజామాబాద్ గోల్ హనుమాన్ ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న జెండా బాలాజీ జాతరలో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం పాల్గొన్నారు. జెండా, ఉత్సవ మూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ పండితులు మహేష్ కుమార్ గౌడ్ కు ఆశీర్వచనం అందించారు.