News September 4, 2025
టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీ: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన యూరియా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ-క్రాప్ నమోదు ఆధారంగా టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంటలు సాగుచేసిన వివరాలు, ఆ పంటలు జాబితా వాటికి అవసరమయ్యే యూరియా మోతాదును డివిజన్, మండల, రైతు సేవ కేంద్రాల వారిగా నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News September 7, 2025
KMR: ఉత్తమ ఉపాధ్యాయులకు 8న అవార్డులు ప్రదానం

కామారెడ్డి జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలందిస్తున్న 41 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ ఈనెల 8న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేసి, శాలువాలతో సత్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.GHM,LFLHM, SA, SGT, PD, SO, CRT తదితర హోదాల్లో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
News September 7, 2025
అరకు: ‘ఆ ప్రాజెక్టుతో 150 గ్రామాలు జలసమాధి’

5వ షెడ్యూల్ ఏరియాలో చేపట్టాలనుకునే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం అరకులోయ వచ్చిన రాష్ట్ర మంత్రి సంధ్యారాణికి వినతి పత్రాలు అందిచారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం డ్యాం నిర్మిస్తే అనంతగిరి, హుకుంపేట, అరకులోయ మండలాల్లో సుమారు 150 గిరిజన గ్రామాలు జలసమాధి అవుతాయని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు.
News September 7, 2025
KNR: మంత్రులూ.. జర రైతులను పట్టించుకోండి..!

ఉమ్మడి KNR జిల్లాలో ఓ పక్క భారీ వర్షాలతో పంట నష్టం, మరోపక్క యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతకు అండగా ఉంటూ భరోసా కల్పించాల్సిన మంత్రులు ఎక్కడున్నారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట పరిహారం ఎప్పుడు ఇస్తారు? యూరియా కష్టాలు ఎప్పుడు తీరుస్తారు? అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా పట్టించుకోండంటూ వేడుకుంటున్నారు.