News April 3, 2024

వైసీపీకి షాక్.. కిల్లి కృపారాణి రాజీనామా

image

AP: శ్రీకాకుళం జిల్లాలో YCPకి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి YCPకి రాజీనామా చేశారు. ‘పార్టీలో నాకు అన్యాయం, అవమానం జరిగింది. కేబినెట్ ర్యాంక్, MP టికెట్ ఇస్తామని మోసం చేశారు. పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో? ఎందుకు తీసేశారో తెలియదు. పదవుల కంటే నాకు గౌరవం ముఖ్యం. ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ ఉంటా’ అని ఆమె వెల్లడించారు. అటు ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Similar News

News February 20, 2026

ట్రంప్ మాకు వద్దు బాబోయ్: భారతీయ అమెరికన్లు

image

ట్రంప్ పాలనపై భారతీయ అమెరికన్లు అసంతృప్తితో ఉన్నట్లు ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (IAAS) వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 71% మంది వ్యతిరేకంగా, 29% మంది సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఇమిగ్రేషన్, దేశ ఆర్థిక వ్యవస్థ, ట్రేడ్, టారిఫ్స్ విషయంలో ట్రంప్ పాలసీలను 65% మందికిపైగా వ్యతిరేకించారు. భారతీయులపై విద్వేషం, భారత్‌తో బంధం సడలడం వంటి కారణాలతో అభిప్రాయం మారినట్లు తెలుస్తోంది.

News February 20, 2026

ఒమన్‌ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా

image

T20WC గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 105 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ మార్ష్ 33 బంతుల్లో 64*(7 ఫోర్లు, 4 సిక్సులు), హెడ్ 19 బంతుల్లో 32(6 ఫోర్లు) విధ్వంసం సృష్టించారు. ఈ గెలుపుతో గ్రూప్-Bలో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆ జట్టు సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

News February 20, 2026

మ్యాక్సీ అరుదైన రికార్డు

image

AUS ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు సాధించారు. T20Iలలో 2,000 రన్స్, 50 వికెట్లు తీసి, 50 క్యాచ్‌లు పట్టిన ఐదో క్రికెటర్‌గా నిలిచారు. T20WCలో ఇవాళ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించారు. గతంలో నబీ(AFG), సికందర్(ZIM), హార్దిక్(IND), వీరందీప్ సింగ్(మలేషియా) ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 16.2 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది.