News April 3, 2024

NTRను హత్తుకున్న విశ్వక్.. లవ్ యూ అంటూ పోస్ట్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను హత్తుకుని దిగిన ఫొటోను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘లవ్ యూ తారక్ అన్నా. దేవర మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉందమ్మా. అనిరుధ్ మ్యూజిక్, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఇరగదీశారు. ఈ ఆల్బమ్ అందరికీ నచ్చుతుంది’ అని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్‌కు విశ్వక్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ త్వరలో రిలీజ్ కానుంది.

Similar News

News February 8, 2026

‘దోస్తో’ యాప్‌ ద్వారానే యూరియా విక్రయాలు: డీఏఓ

image

జిల్లాలో యూరియా అమ్మకాలు ఇకపై యాప్ ద్వారానే సాగాలని డీఏఓ అజయ్ కుమార్ తెలిపారు. అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం ‘దోస్తో’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా దుకాణదారులు నిరంతరం స్టాక్ వివరాలను అప్డేట్ చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రైతులకు తోడ్పాటు అందించాలని ఒక ప్రకటనలో కోరారు.

News February 8, 2026

DRDOలో అప్రెంటిస్ పోస్టులు

image

<>DRDO<<>>కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలసిస్(ISSA) 21 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech(CS), డిప్లొమా(CS), MSc(మ్యాథ్స్), అర్హతగల వారు ఫిబ్రవరి 27 వరకు దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను hrd.issa@gov.inకు ఈ -మెయిల్ చేయాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News February 8, 2026

SRK ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ‘కింగ్’ తర్వాత రెండేళ్లు సెలవు?

image

షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కి ఇది కొంచెం షాకింగ్ న్యూసే. అప్ కమింగ్ మూవీ ‘కింగ్’ రిలీజ్ తర్వాత ఆయన రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. వరుస షూటింగ్స్, స్టంట్స్ వల్ల భుజం గాయంతో పాటు ఇతర హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతుండటమే దీనికి కారణం. బాడీకి కంప్లీట్ రెస్ట్ ఇచ్చి హెల్త్ సెట్ చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘కింగ్’ తర్వాత స్క్రీన్‌పై SRKని చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.