News September 4, 2025
టెక్ దిగ్గజాలకు ట్రంప్ డిన్నర్.. మస్క్‌కు నో ఎంట్రీ

టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ కంపెనీల ఫౌండర్లు, CEOలకు US అధ్యక్షుడు ట్రంప్ ఈ రాత్రికి డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు. దీనికి బిల్‌గేట్స్, టిమ్ కుక్, జుకర్‌బర్గ్, పిచాయ్, సత్య నాదెళ్ల, ఆల్ట్‌మన్ తదితరులు హాజరుకానున్నారు. అయితే మస్క్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. ట్రంప్ అధికారం చేపట్టాక ఆయనకు కీలక పదవి ఇవ్వగా, తర్వాత ఇద్దరికీ చెడింది. దీంతో మస్క్‌ను ట్రంప్ దూరం పెడుతూ వస్తున్నారు.
Similar News
News September 8, 2025
సంక్రాంతి బరిలో రవితేజ సినిమా?

కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జనవరి 13వ తేదీని మూవీ టీమ్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీకి ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలాఖరులోగా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఈ ఏడాది అక్టోబర్/ నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
News September 8, 2025
‘టెట్’ నిబంధనతో సీనియర్లకు అన్యాయం: TS UTF

TG: ప్రభుత్వ టీచర్లకు TET తప్పనిసరి అని ఇచ్చిన <<17587484>>తీర్పును<<>> సుప్రీంకోర్టు పునః సమీక్షించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTF) కోరింది. ’20-25 ఏళ్లుగా విధుల్లో ఉన్న సీనియర్లను TET రాయమనడం అన్యాయం. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన వారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలి. 2010 NCTE నోటిఫికేషన్ ప్రకారం TET పాస్ అనేది నియామకాలకు తప్పనిసరి అయింది’ అని గుర్తుచేసింది.
News September 8, 2025
రజినీకాంత్‌తో పోటీ లేదు: కమల్ హాసన్

రజినీకాంత్‌కు, తనకు మధ్య ఎలాంటి పోటీ లేదని కమల్ హాసన్ తెలిపారు. ఆడియన్సే తమ మధ్య కాంపిటీషన్ ఉన్నట్లు భావిస్తారని అన్నారు. ‘మేమిద్దరం ఒకరి సినిమాలను మరొకరు నిర్మించాలని అనుకునేవాళ్లం. ఎప్పటినుంచో కలిసి నటించాలనుకుంటున్నాం. త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం’ అని వెల్లడించారు. కాగా రజినీ, కమల్ హీరోలుగా లోకేశ్ కనగరాజ్ ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.