News September 5, 2025
వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సీపీ సమీక్ష

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 6న జరగనున్న గణపతి నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజతో పాటు ఇతర ఏసీపీలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 8, 2025
సంక్రాంతి బరిలో రవితేజ సినిమా?

కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జనవరి 13వ తేదీని మూవీ టీమ్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీకి ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలాఖరులోగా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఈ ఏడాది అక్టోబర్/ నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
News September 8, 2025
‘టెట్’ నిబంధనతో సీనియర్లకు అన్యాయం: TS UTF

TG: ప్రభుత్వ టీచర్లకు TET తప్పనిసరి అని ఇచ్చిన <<17587484>>తీర్పును<<>> సుప్రీంకోర్టు పునః సమీక్షించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTF) కోరింది. ’20-25 ఏళ్లుగా విధుల్లో ఉన్న సీనియర్లను TET రాయమనడం అన్యాయం. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన వారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలి. 2010 NCTE నోటిఫికేషన్ ప్రకారం TET పాస్ అనేది నియామకాలకు తప్పనిసరి అయింది’ అని గుర్తుచేసింది.
News September 8, 2025
సంగారెడ్డి: ఉద్యోగాల భర్తీకి రేపే చివరి తేదీ

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన 59 పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఒప్పంద పద్ధతిపై ఇన్స్‌ట్రక్టర్, ఆయాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్నదని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.