News September 5, 2025
గణేశ్, మిలాద్-ఉన్-నబీ భద్రతపై సీపీ సమీక్ష

హైదరాబాద్ సీపీ సి.వి. ఆనంద్ నగరంలో జరగనున్న గణేశ్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీనియర్ అధికారులు, జోన్ డీసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 5న మిలాద్-ఉన్-నబీ, 6న ప్రధాన గణేశ్ నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్, ఎంజే మార్కెట్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బ్లూ కోర్టు మరియు పెట్రోలింగ్ బృందాలు నిఘాను పెంచాలని ఆదేశించారు.
Similar News
News September 8, 2025
కర్నూలు: హృదయాన్ని పిండేసే ఘటన

ఎమ్మిగనూరులోని శివ సర్కిల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధురాలిని వదిలి వెళ్లిన దృశ్యం హృదయాన్ని పిండేసింది. 2 రోజులుగా ఆమె రోడ్డు పక్కనే ఉంటూ ఎవరైనా ఆహారం ఇస్తే తిని జీవించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న వేదాస్ స్వచ్ఛంద సంస్థకు చెందిన సునీల్ కుమార్, చికెన్ బాషా ఆమెకు ప్రేమతో సపర్యలు చేశారు. ఆటోలో ఆదోనిలోని జీవన జ్యోతి ఆశ్రమానికి తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు.
News September 8, 2025
భారీగా పడిపోయిన ఉల్లి ధరలు!

ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. TGలో కిలోకు రూ.5-16 మాత్రమే దక్కుతోంది. వినియోగదారులకు మాత్రం రూ.25-45 మధ్య లభిస్తోంది. ఫలితంగా మధ్యవర్తులే లాభపడుతున్నారు. APలో క్వింటా కనిష్ఠంగా రూ.501, గరిష్ఠంగా రూ.1,249 పలుకుతోంది. రైతుకు కేజీకి రూ.5-12 మధ్యే దక్కుతోంది. కొన్ని మార్కెట్లలో ఉల్లి నిల్వలు పేరుకుపోయి కొనుగోళ్లూ నిలిచిపోయాయి. ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
News September 8, 2025
ప్రొద్దుటూరు జిల్లా డిమాండ్‌కు MLA మద్దతు

ప్రొద్దుటూరు జిల్లా డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈక్రమంలో ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులు పలువురి మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆదివారం కలిసి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. జిల్లాల రీ ఆర్గనైజేషన్ కమిటీ త్వరలో కడప జిల్లా పర్యటనకు వస్తుందని.. అప్పుడు ప్రొద్దుటూరు జిల్లాపై వినతిపత్రం అందజేస్తానని చెప్పారు.