News September 5, 2025
ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సబ్ కలెక్టర్

మార్కాపురం MPDO కార్యాలయంలో ఎరువుల నియంత్రణ చట్టంపై వ్యవసాయ సహాయకులకు, డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ S.V.త్రివినాగ్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ఎరువుల కొరత సృష్టిస్తే డీలర్షిప్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను MRP ధరలకే విక్రయించాలని సూచించారు. MRO చిరంజీవి, SI సైదుబాబు పాల్గొన్నారు.
Similar News
News September 7, 2025
ప్రకాశంలో పలు ఆలయాలు మూసివేత..!

ప్రకాశం జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాల దర్శనాలను ఆలయాల ఈవోలు నిలిపివేశారు. నేడు చంద్రగ్రహణం కారణంగా దర్శనాల నిలిపివేతపై ఆలయాల అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ప్రధానంగా జిల్లాలోని భైరవకోనలో వెలసిన శ్రీ భైరవేశ్వర ఆలయం, త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం, మార్కాపురంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం, పలు ఆలయాల దర్శనాలను నిలిపివేశారు. సోమవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలకు అనుమతిస్తారు.
News September 7, 2025
ఒంగోలులో 5K రన్.. ప్రైజ్ మనీ ఎంతంటే.!

ఒంగోలులో ఈనెల 12న కలెక్టర్ కార్యాలయం నుంచి 5 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. 17 నుంచి 25 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులు, అలాగే ట్రాన్స్‌జెండర్ విభాగాల్లో ఈ పరుగు పందెం నిర్వహిస్తామన్నారు. పోటీలో ప్రథమ విజేతకు రూ.10వేలు, ద్వితీయ విజేతకు రూ.7వేలు అందిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 10వ తేదీలోగా 9493554212 నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News September 7, 2025
ప్రకాశం: వైద్యారోగ్య శాఖలో ఖాళీలు.. మెరిట్ లిస్ట్ విడుదల!

ప్రకాశం జిల్లాలో గల పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సెస్, ఎఫ్ఎన్ఓ, ఎస్ఏడబ్ల్యు పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల మెరిట్, తిరస్కరణ లిస్ట్ విడుదల చేసినట్లు DMHO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్వో కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు http://Prakasam.ap.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.